20 నుంచి ‘ఆర్ఆర్ఆర్’ ఫ్రీ

Free: “ZEE5” ఇప్పుడు “RRR” ‘రౌద్రం రణమ్ రుధిరం’ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ‘RRR’ (‘రౌద్రం రణం రుధిరం’) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా ‘పే పర్ వ్యూ’ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకు ముందు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.. కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు.

అయితే “ZEE5” టీం సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, “ZEE5” T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది. సాధారణ చందా ఉన్న చందాదారులందరికీ ‘RRR’ ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న “ZEE5” సబ్‌స్క్రైబర్‌ లు ‘RRR’ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను “ZEE5” టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, స్ట్రీమింగ్ దిగ్గజం “ZEE5” వారు మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు ‘RRR’ని ఉచితంగా అందించనుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్‘. మే 20వ తేదీన ‘ZEE5’ ఓటీటీ వేదికలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు  కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేకమైన‌ రోజు. అందుకే ZEE5 వారు ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెర పైకి “RRR” ప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు.

Also Read : ఆర్ఆర్ఆర్: 500 కేంద్రాల్లో 50రోజులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *