Wednesday, June 17, 2026
Homeసినిమా జులై 7న 'రుద్రంగి' విడుదల

 జులై 7న ‘రుద్రంగి’ విడుదల

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్ సినిమా పై ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలు, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందీ సినిమా. ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా ‘రుద్రంగి’ రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉండేవి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికర కథా కథనాలతో సినిమా ఈ చిత్రం ఆకట్టుకోబోతోంది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నిర్మాత రసమయి బాలకిషన్ తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular