Thursday, June 18, 2026
Homeసినిమా'భాగ్ సాలే' చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్న సిద్ధు జొన్నలగడ్డ

‘భాగ్ సాలే’ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్న సిద్ధు జొన్నలగడ్డ

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ ను చిత్రబృందం వెల్లడించింది. వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేను ప్రేక్షకులకు  హీరో సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేయబోతున్నారు. ఆయన వాయిస్ ఓవర్ తో భాగ్ సాలే చిత్ర నేపథ్యాన్ని వివరించబోతున్నారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు ఏంటి అనేది సిద్ధు వాయిస్ లో ఆసక్తికరంగా చెప్పబోతున్నాడు. భాగ్ సాలే ప్రపంచం ఎలా ఉండనుంది అనేది జూలై 7న థియేటర్స్ లో చూడాలని మూవీ టీమ్ కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని.. విజయం సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular