రిలీజ్ రెడీ అవుతున్న ‘HER’

చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న రుహాణి శర్మ.. HIT మూవీతో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘HER’ డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది.

రీసెంట్ గానే హీరో నాని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ లో రుహాణి శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియోలోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *