‘బ్రో’ డబ్బింగ్ ప్రారంభం

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘బ్రో’. ఇందులో సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. కొంత ప్యాచ్ వర్క్ ఉంటే.. అది కూడా పూర్తి చేసి ఇప్పుడు డబ్బింగ్ వర్క్ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

ఇటీవల రిలీజ్ చేసిన పవన్ ఫస్ట్ లుక్ అండ్ తేజ్ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇక వీరిద్దరూ కలసి ఉన్న లుక్ అయితే.. అదిరింది అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. త్వరలో ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు బ్రో మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ బలంగా ఉంది. ఈ క్రేజీ భారీ చిత్రాన్ని జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *