Sunday, January 19, 2025
HomeTrending Newsపశ్చిమ దేశాల కుట్రకు ఉక్రెయిన్ బలి

పశ్చిమ దేశాల కుట్రకు ఉక్రెయిన్ బలి

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ రూపు రేఖలు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ నగరాలపైకి రష్యా క్షిపణులు మిడతల దండులా దూసుకువస్తున్నాయి.  28 రోజులుగా సాగుతున్న యుద్దంలో రెండు దేశాలు హోరాహోరీగా దాడులు ప్రతి దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని కీవ్ పై రష్యా సేనలు క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ రోజు సుమారు 30 రాకెట్ లతో రష్యా దాడులు చేయగా కీవ్ నగరం శవాల దిబ్బగా మారుతోంది. కీవ్ లో లక్షన్నర మంది చిక్కుకుపోయారు. మరో వైపు మరియుపోల్ లో అన్న పానీయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. తాగేందుకు నీరు కూడా కరువైంది. అటు ఖర్కివ్ పై రష్యా బలగాలు గుక్క తిప్పుకోకుండా ఒకే రోజు ముప్పైసార్లు దాడులు చేశాయి.

పశ్చిమ దేశాలు చర్చలను ప్రోత్సహించకపోగా రష్యాను రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు, హెచ్చరికలు చేయటం ఉక్రెయిన్ కు ప్రాణసంకటంగా మారింది. అమెరికా, పశ్చిమ దేశాల మాయలో పడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద్మీర్ జేలేన్సకీ చర్చలకు సిద్దమని చెపుతూనే యుద్ధం కొనసాగిస్తున్నాడు. అగ్ర దేశాలు పోలాండ్ ద్వారా యుద్ధ ట్యాంక్ లు, డ్రోన్ లు అందిస్తూ ఉక్రెయిన్ ను ఉబిలోకి దించుతున్నాయి. ఉక్రెయిన్ –రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తున్నా పరోక్షంగా రష్యా – అమెరికా,నాటో కూటమి యుద్దమనే చెప్పాలి. రేపు నాటో కూటమి సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వస్తున్నాడు. ఆ తర్వాత జో బిడెన్ పోలాండ్ వెళ్ళే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రష్యా మరింత దుందుడుకుగా వ్యవహరించే ముప్పు పొంచి ఉంది. ఉక్రెయిన్ దాడికి రాకపోతే అవసరమైతే న్యూక్లియర్ దాడికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ హెచ్చరించారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల కొరత ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, యుద్ధ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని అధికమించేందుకు పుతిన్ మరింత తీవ్ర చర్యలకు దిగే ప్రమాదం పొంచి ఉంది.

Also Read : కీవ్ పై రష్యా భీకర దాడులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్