Saturday, June 13, 2026
HomeTrending Newsబీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ను కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే రాష్ట్రంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక రకాల మోసాలకు, ద్రోహాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. బుధవారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన టి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు గులాబీ దండు ఇంటింటికి వెళ్లి ఎండగట్టాలని ఆయన సూచించారు.
ఇవాళ పంజాబ్‌ను మించి అత్యధిక వరిని తెలంగాణ పండిస్తుందని, వడ్లను కొనకుండా ఇబ్బందిపెడుతుందన్నారు. సాకులు చూపి తెలంగాణ రైతులను నట్టేట ముంచేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తెలంగాణ రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌ ఎంతకైనా కొట్లాడుతుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ మోసాలను ఎండగట్టాలని, రేపటి నుంచి నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టి రైతులను సంఘటితం చేసి.. బీజేపీ దుష్ట పాలనను వివక్షను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కేంద్రంపై పోరాటం చేస్తామని, వడ్లు కొనేదాక కేంద్రాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. బీజేపీ పార్టీ దేశానికే ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా రైతుల పాలిట శనిలా దాపురించిందన్నారు.

Also Read : తెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular