Monday, March 17, 2025
HomeTrending NewsSachin Pilot: సచిన్ పైలట్ ఒక రోజు దీక్ష...ఇరకాటంలో కాంగ్రెస్

Sachin Pilot: సచిన్ పైలట్ ఒక రోజు దీక్ష…ఇరకాటంలో కాంగ్రెస్

వసుంధర రాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ పైలట్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జైపుర్​లోని షహీన్‌ స్మారక్‌ వద్ద సచిన్‌ పైలట్‌ ఆందోళన ప్రారంభించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అంతకుముందు సంఘ సంస్కర్త జ్యోతిరావ్‌ ఫూలే జయంతిని పురస్కరించుకొని జైపుర్​లోని గోడౌన్‌ సర్కిల్‌ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు పైలట్​.

కాంగ్రెస్ పార్టీ ఈ ఒక రోజు నిరాహార దీక్ష‌కు వ్య‌తిరేకంగా ఉంది. రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రోజు (సోమవారం) స్పందించింది. ఆ దీక్ష‌పై కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ జారీ చేసింది. ఇది పార్టీ వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్న‌ది. పైలట్‌ దీక్ష పార్టీ వ్యతిరేక చర్య కిందకే వస్తుందని పేర్కొంది. బహిరంగంగా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా పార్టీలో చర్చిస్తే బాగుండేదని అభిప్రాయపడింది.  ప్ర‌భుత్వంతో ఏదైనా విబేధాలు ఉంటే, దాన్ని పార్టీ ఫోర‌మ్‌లో డిస్క‌స్ చేయాల‌ని, కానీ మీడియాకు ఎక్క‌డం స‌రికాదు అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ సుఖ్‌జింద‌ర్ సింగ్ రాంధ్‌వా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్