Monday, June 8, 2026
HomeTrending Newsహైదరాబాద్ లో శాఫ్రాన్ కేంద్రం: కేటీఆర్

హైదరాబాద్ లో శాఫ్రాన్ కేంద్రం: కేటీఆర్

Another Feather: హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాటచేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్ల తో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటుచేస్తుంది. ఇండియాలో తన తొలి MRO కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఐటీశాఖమంత్రి కే.తారకరామారావు.

శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం (MRO)ఇదేనన్న కేటీఆర్, మనదేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే అన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్‌ ఏర్పాటుచేస్తున్న ఈ ప్రతిపాదిత ఎంఆర్‌వో తో సుమారు వెయ్యి ఉద్యోగాలు కల్పించబడతాయని చెప్పారు. భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్ లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. దిగ్గజ సంస్థ ఐన శాఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందన్నారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular