Sunday, January 19, 2025
HomeTrending NewsSahel: ఇస్లామిక్ తీవ్రవాదం...సహారా ఎడారిలో మారణహోమం

Sahel: ఇస్లామిక్ తీవ్రవాదం…సహారా ఎడారిలో మారణహోమం

ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఎడారి ప్రాంతాన్ని…దక్షిణాన సవాన్నా గడ్డి భూములను విడదీస్తూ….పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం నుంచి తూర్పున ఎర్ర సముద్రం వరకు విస్తరించిన ప్రాంతాన్నే సాహెల్ గా పిలుస్తారు. సెనెగల్, మౌరిటానియా, మాలి, బుర్కినా ఫాసో, నైజర్, నైజీరియా, కామెరూన్, చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సూడాన్,ఎరిట్రియా దేశాల్లో విస్తరించింది.

సహారాకు దక్షిణంగా..  ఐరోపా ఖండం పరిమాణంలో ఉన్న సాహెల్ పై ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు తమ పట్టు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాద దాడులు, హత్యలు… గ్రామాలపై దాడులతో జిహాదీల చొరబాట్లు ప్రతిరోజూ జరుగుతాయి.దీంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.

ఆఫ్రికా ఖండాన్ని ఇస్లామీకరణ చేసే లక్ష్యంతో ఇస్లామిక్ ఉగ్రవాదులను గల్ఫ్ దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. సహారా ఎడారిలోని ప్రతి దేశంలో పంటి కింద రాయిలా జిహాదీలు…ప్రభుత్వాలను ఎదిరిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసిన ఫ్రాన్స్ క్రైస్తవాన్ని అంటగట్టగా…ఇస్లాం విస్తరణకు గల్ఫ్ దేశాలు ఉగ్రవాదులతో చేతులు కలిపాయి. దీంతో స్థానిక ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు అంతరించిపోతున్నాయి.

జిహాదీల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు ఆఫ్రికన్ దేశాలకు చెందిన సైన్యాలు కష్టపడుతున్నాయి. సాహెల్ ప్రాంతాన్ని దశాబ్దాలుగా ఏలిన ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు తమ సైనిక మద్దతును తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇక్కడి వనరులు దోచుకున్న ఫ్రాన్స్ ప్రజల సంక్షేమాన్ని ఎడారిలో వదిలేసింది. దీంతో స్థానిక ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డోగోన్ ప్రజల మాతృభూమి అయిన మాలి ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. పాత తుపాకులతో ఆయుధాలు కలిగిన వెయ్యి మందితో కూడిన మిలీషియా… కలాష్నికోవ్‌లు, రాకెట్ లాంచర్‌లతో కూడిన ఇస్లామిక్ తీవ్రవాదులను ఎదుర్కొంటున్నారు. ఈ “డోజో” యోధులు కూడా తాయెత్తులు, మూడ నమ్మకాలు, సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడతారు. వారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో, నీరు, ఆహారం లేకుండా పోరాడుతారు. ఇప్పటికీ డోగన్ పీఠభూమిలో నివసిస్తున్న మూడు లక్షల మంది ప్రజల రక్షణ కోసం పోరాటం చేస్తున్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందున్న మోరిటానియా…డోజో యోధులకు కొంత సహకరిస్తోంది. మాలి సరిహద్దులో జిహాది గ్రూపులను, వారికి సహకరించే వారిని గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వెన్షన్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. SIG నేతృత్వంలో ఆపరేషన్ సమయంలో మౌరిటానియన్ సైన్యానికి అసాధారణమైన యాక్సెస్ ఇవ్వబడింది. తేలికపాటి విమానాల స్క్వాడ్రన్ స్పాటర్‌లుగా పనిచేసి… జిహాదీ వాహనాలను గుర్తించి సరిహద్దు దాటగానే వాటిని ధ్వంసం చేస్తుంది.

తమ భూభాగంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు చేరుకోగల ప్రత్యేక పోలీసు బలగాలను మోరిటానియా  కలిగి ఉంది. డ్రోమెడరీలు, రైడర్స్ కంపెనీ చాలా వారాల పాటు ఎడారిలోకి వెళ్లి, సంచార జాతుల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. జిహాదీలను కట్టడి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాలి అధ్యక్షుడిని కలిసి తమ మద్దతు తెలిపారు. మాలిలో జిహాదీలను కట్టడి చేసేందుకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. రష్యా సహకారంతో వాగ్నర్ కిరాయి సైన్యం ఈ ప్రాంతంలో జిహాదీలపై పోరాటం చేస్తోంది.

పేదరికంతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో సంతానోత్పత్హి(fertility) అధికంగా ఉంది. పౌష్టికాహార లోపంతో మహిళలు, చిన్నారులు ఎక్కువగా చనిపోతున్నారు. ఒక కుటుంబంలో సుమారు ముప్పైమంది వరకు ఉండటం ఇక్కడ సాధారణం. కుటుంబ నియంత్రణపై అవగాన కల్పించి…పౌష్టికాహారం అందించకపోతే…జిహాదీల దాడులతో ఈ ప్రాంతం శవాల దిబ్బగా మరే ప్రమాదం ఉంది.

ఐక్యరాజ్యసమితి మానవతా సాయం చేస్తున్నా… ఉగ్ర దాడుల మధ్య అది కొనసాగటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు జోక్యం చేసుకొని సహారా దేశాలను ఆడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్