Sunday, January 19, 2025
Homeసినిమాఘనంగా సాయిరామ్ శంకర్ బర్త్ డే వేడుకలు

ఘనంగా సాయిరామ్ శంకర్ బర్త్ డే వేడుకలు

సాయిరామ్ శంకర్  తాజా చిత్రం ‘వెయ్ దరువెయ్‘. శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు  నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో యశా హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, సత్యం రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్నా రు.

నేడు సెప్టెంబర్ 13న  హీరో సాయిరామ్ శంకర్  పుట్టిన రోజు  వేడుకలను సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్  ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అంతా పాల్గొంది. ప్రొడ్యూసర్ దేవరాజు  మాట్లాడుతూ.. ఇప్ప టికే ఈ మూవీ షూటింగ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  త్వరలోనే మిగతా ఫైట్స్, రెండు సాంగ్స్  పూర్తి చేసి నవంబర్ లో గ్రాండ్ గా  విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “నిర్మా త దేవరాజు,  డైరెక్టర్ నవీన్ రెడ్డి  గార్లకు ప్రత్యే కంగా థ్యాంక్స్ చెబుతున్నాను. వీళ్ళతో  సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌ పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్