Thursday, May 8, 2025
HomeTrending Newsఈ పని వారిదే : సజ్జల అనుమానం

ఈ పని వారిదే : సజ్జల అనుమానం

తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగి ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడ్డ సమయంలో లోకేష్ దుబాయ్ లో పర్యటించడం ఈ అనుమానాలను బలపరుస్తోందని వ్యాఖ్యానించారు. కొంతకాలం క్రితం చంద్రబాబు కూడా మాల్దీవులు వెళ్లి వచ్చారని, గతంలో హసన్ అలీ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాలు బైటపడిన నేపథ్యంలో ఈ డ్రగ్స్  విషయంలో కూడా వారికి సంబంధం ఉండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు టిడిపి నేతలు, వారి బాకాలు తమపై ఆరోపణలు చేస్తున్నాయేమో అని గట్టిగా అనుకోవాల్సి వస్తోందన్నారు. అందుకు తగ్గట్టుగానే వారి కదలికలు కూడా కనిపిస్తున్నాయన్నారు. దీనిపై కచ్చితంగా సీబీఐ లేదా డీఆర్‌ఐ విచారణలో అసలు విషయం బయటకు రాబట్టాలనేది మా ఆకాంక్ష అని సజ్జల వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు,

హెరాయిన్ వ్యవహారంపై టిడిపి, దానికి బాకాలూదుతున్న మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల  మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని తమ పార్టీకి, తమ నేత వైఎస్ జగన్ కు అంటగట్టే దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. అసలు పూర్తిగా విచారణ జరగక ముందే సుధాకర్ అనే వ్యక్తి ఇక్కడి అడ్రస్ తో తో ఉన్నాడు కాబట్టి తమకు అంటగట్టారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమౌళి, బోయపాటి లాంటి దర్శకుల తరహాలో కథలు అల్లి, ఎలా తమకు సంబంధం కలపాలో స్కెచ్ లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో నెలకొన్న మంచి వాతావరణాన్ని విషతుల్యం చేయాలని చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ప్రొసీడ్‌ అవడానికి సిద్ధం అవుతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యవహారాల  మీద  ప్రజలను మిస్‌లీడ్‌ చేయడానికి ఆరోపణలు చేస్తున్నారని . గంజాయి సాగును నేలమట్టం చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించాల్సింది పోయి.. హెరాయిన్‌కు గంజాయికి లింక్‌పెట్టి అల్లుతున్న కథను సినిమా కథకు ఏమైనా రాంగోపాల్‌ వర‍్మకు ఇస్తే పనికివస్తుందని సజ్జల ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్