Saturday, January 18, 2025
HomeTrending Newsవైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

Sajjala Announced Mlc Candidates List :

ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైఎస్సార్సీపీ ప్రకటించింది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేర్లను మీడియాకు వెల్లడించారు.

11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరుగుతోన్న మరో 3 స్థానాలు మొత్తం 14 స్థానాలకు గాను 7 ఓసీలకు, 7  బీసీ, మైనారిటీ, ఎస్సీలకు కేటాయించామని సజ్జల వివరించారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేకపోయిన వారికి రాబోయేకాలంలో తప్పనిసరిగా అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.

స్థానిక సంస్థల నియోజకవర్గం అభ్యర్ధులు:

విజయనగరం
ఇందుకూరి రఘురాజు (క్షత్రియ-ఓసి)

విశాఖపట్నం
వంశీకృష్ణ యాదవ్  (యాదవ-బీసీ)
వరుదు కళ్యాణి (కొప్పుల వెలమ-బీసీ)

తూర్పుగోదావరి
అనంతబాబు (కాపు-ఓసి)

కృష్ణా
తలశిల రఘురాం (కమ్మ- ఓసి)
మొండితోక అరుణ్ కుమార్ (మాదిగ-ఎస్సీ)

గుంటూరు
ఎమ్.హనుమంతరావు (చేనేత-బిసి)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (కాపు-ఓసి)

ప్రకాశం
తూమాటి మాధవ రావు (కమ్మ-ఓసి)

చిత్తూరు
కృష్ణ రాఘవ భరత్ (బీసీ – వన్యకుల క్షత్రియ )

అనంతపురం
వై. శివరామిరెడ్డి (రెడ్డి- ఓసి)

ఎమ్మెల్యేల నియోజకవర్గం అభ్యర్ధులు:

పాలవలస విక్రాంత్‌ (శ్రీకాకుళం- తూర్పు కాపు – బిసీ)
ఇషాక్‌ భాషా (కర్నూల్ జిల్లా – మైనార్టీ)
డీసీ గోవిందరెడ్డి (వైఎస్సార్- రెడ్డి ఓసి)


ఇవి కూడా చదవండి:  వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్