Thursday, September 19, 2024
Homeసినిమాసాక్షి వైద్యకి పెరుగుతున్న డిమాండ్! 

సాక్షి వైద్యకి పెరుగుతున్న డిమాండ్! 

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూ వస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేయడానికే మేకర్స్ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన కృతి శెట్టి .. శ్రీలీల ఇద్దరూ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంటుగా ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్ కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో హీరోయిన్ రెడీ అవుతోంది. ఆ బ్యూటీ పేరే సాక్షి వైద్య.

మహారాష్ట్రకి చెందిన ఈ సుందరి మోడలింగ్ లో తన ప్రత్యేకతను చాటుతూ వెళుతోంది. బాలీవుడ్ సినిమాల దిశగా ఆమె అడుగులు వేస్తుండగా సురేందర్ రెడ్డి ఆమెను ‘ఏజెంట్’ సినిమా కోసం తీసుకున్నాడు. అఖిల్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా ఏప్రిల్లో థియేటర్లకు రానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ ఆమె పోస్టర్స్ ను కూడా వదిలింది లేదు. కానీ ఆమె గ్లామర్ గురించి ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. తమ నెక్స్ట్ ప్రాజెక్టులలో ఆమెను తీసుకోవటానికి మేకర్స్ ఆసక్తిని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమె వరుణ్ తేజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘గాండీవధారి అర్జున’లో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుంది. టాలీవుడ్ లోని యంగ్ హీరోలు తమ సినిమా కోసం సాక్షి వైద్యనే తీసుకోమని మేకర్స్ తో చెబుతున్నారట. చూస్తుంటే ఈ బ్యూటీ ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్