మంజీరా నదిలో వరద ఉధృతి పెరగటంతో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర రహదారిని మూసివేశారు. మంజీరాకు అవతల వైపు మహారాష్ట్ర పోలీసులు కూడా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు విధించారు.
బోధన్ మండలంలోని కాంగ్వావ్ గ్రామం వద్ద ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న వంతెనపై రాకపోకలను నిషేధించారు. కాగా, సాలురా వద్ద గల పాత బ్రిడ్జి పైనుంచి వరద ప్రమాదకరరీతిలో ప్రవహిస్తుండటంతో మంజీరా తీరప్రాంతంలోని గ్రామాలు జలమయమయ్యాయి.