Sunday, June 7, 2026
Homeసినిమాఆగస్టు 12న సమంత 'యశోద' విడుదల

ఆగస్టు 12న సమంత ‘యశోద’ విడుదల

Yashoda: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా ‘యశోద‘. శ్రీదేవి మూవీస్‌ పతాకం పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… “యశోదలో సమంత తన నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌ లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం” అని చెప్పారు.

Also Read : సమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular