Tuesday, March 17, 2026
Homeసినిమాఒక పాట మినహా 'యశోద' షూటింగ్ పూర్తి

ఒక పాట మినహా ‘యశోద’ షూటింగ్ పూర్తి

Yasoda: ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన సమంత నటిస్తోన్న  ‘యశోద‘ షూటింగ్ ఒక సాంగ్ మినహా పూర్తయింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం. ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి ‘యశోద’ పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం.

అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల, ఇతర వివరాలు తెలియజేస్తాం. సమంత యశోద పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్ తో యాక్షన్ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ చిత్రం అద్భుతంగా వచ్చేలా సహకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular