Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Yasoda: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం ‘యశోద’. జంట దర్శకులు హరి – హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ ను ఈ రోజు విడుదల చేశారు.

ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఈ టీజ‌ర్ లో య‌శోద (స‌మంత‌) కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త కొత్త గాను, వింత వింత గానూ అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..? ఇదంతా ‘యశోద’ ఫస్ట్ గ్లిoప్స్ లో కనిపించింది. దీన్ని బట్టే యశోద సినిమా ఎంతో వైవిధ్యంగా ఉంటుంద‌నిపిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ…ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని దృష్టి లో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే సమంత ‘యశోద’ పాత్ర విషయంలో కనబరిచిన డెడికేషన్, పాత్రను సొంతం చేసుకున్న తీరు ఎక్సలెంట్. సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తైయింది.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఆఖరి షెడ్యులు చేస్తున్నాం. జూన్ మొదటి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ లో కోడైకెనాల్ లో క్లైమాక్స్ తీశాం. ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ప్రదాన తారాగణం పై ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం. ఈ సినిమాలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. జంట దర్శకులు హరి – హరీష్ సినిమాని తీర్చిదిద్దుతున్న తీరు ఇంప్రెసివ్ గా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం అని చెప్పారు.

Also Read : ఆగస్టు 12న సమంత ‘యశోద’ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com