Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

చాలా రోజుల తర్వాత టెన్నిస్ లో మరో పతకానికి భారత ఆటగాళ్ళు చేరువయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మన దేశానికి చెందిన సానియా మీర్జా- బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జెలెనా ఒత్సాపెంకో (లాట్వియా)-  డేవిడ్ వేగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీపై తలపడాల్సి ఉంది. కానీ గాయం కారణంగా ప్రత్యర్థులు వైదొలగడంతో(వాకోవర్) సానియా-బోపన్న సెమీస్ లో అడుగు పెట్టారు.

అంతకుముందు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఎరియల్ బేహార్ (ఉరుగ్వే)-నినోమియా(జపాన్) జంటపై గెలుపొంది  క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ టోర్నమెంట్ తరువాత టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు సానియా మీర్జా ప్రకటించిన నేపథ్యంలో ఈ టైటిల్ గెల్చుకొని చిరస్మరణీయమైన  వీడ్కోలు చెప్పాలని భారత టెన్నిస్ అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com