Tuesday, June 9, 2026
Homeసినిమా23న 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్

23న ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్

Title Song: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట‘ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా నుంచి బయటికి వస్తున్న కంటెంట్ కు వస్తున్న స్పందన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ఇప్పటికే సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి.

ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న ఉదయం 11.07 కు విడుదల చేయనున్నారు. అదే పాట ట్యూన్ ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించడం మరో విశేషం. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్ల పై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో షూట్ చేస్తున్న ఈ పాట మాస్ సాంగ్ గా అలరించనుంది. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఇప్పటికే కళావతి, పెన్నీ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ లో జోరు కొనసాగిస్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read : సౌత్ ఇండియా రికార్డు క్రియేట్ చేసిన ‘క‌ళావ‌తి’ పాట‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular