Wednesday, May 8, 2024
Homeసినిమాచిరు 154 మూవీ టైటిల్ ఇదే

చిరు 154 మూవీ టైటిల్ ఇదే

Title fix: మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతో న్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. 90లో చిరంజీవి సినిమాల్లో ఎలా క‌నిపించేవారో అలా ఈ సినిమాలో చూపించ‌నున్నారు బాబీ. ఫ‌స్ట్ లుక్ తోనే సినిమా పై భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రానికి వాల్తేరు వాసు, వాల్తేరు వీర‌య్య‌, మాస్ మూల‌విరాట్టు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. దీంతో ఈ మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు అనేది ఆస‌క్తిగా మారింది.
అయితే.. ఇటీవ‌ల శేఖ‌ర్ మాస్ట‌ర్ ఓ ఇంట‌ర్ వ్యూలో త‌ను చేస్తోన్న నెక్ట్స్ మూవీస్ గురించి చెబుతూ.. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల‌కు వ‌ర్క్ చేస్తున్నాను. అలాగే తమిళంలో రెండు ప్రాజెక్టులు, అలాగే చిరంజీవి నటిస్తోన్నభోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు పని చేస్తున్నానని చెప్పారు. ఈ విధంగా అనుకోకుండా.. శేఖ‌ర్ మాస్టర్ చిరు, బాబీ మూవీకి వాల్తేరు వీర‌య్య అనే టైటిల్ ఫిక్స్ చేశార‌నే విష‌యం చెప్పేశారు. మ‌రి.. ఈ మూవీ టైటిల్ ను అఫిషియ‌ల్ గా త్వ‌ర‌లో అనౌన్స్ చేస్తారేమో చూడాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్