Monday, June 8, 2026
Homeసినిమా'స‌ర్కారు వారి పాట' ఆల్ టైమ్ రికార్డ్

‘స‌ర్కారు వారి పాట’ ఆల్ టైమ్ రికార్డ్

Rec0rds goes on: మహేష్ బాబు న‌టించిన‌ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైల‌ర్ లో ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ డైరెక్టర్ అనిపించుకున్నప్పటికీ.. మాస్ పల్స్‌ పట్టేశాడని అంటున్నారు సినీ జ‌నాలు. మహేష్ కామెడీ టైమింగ్.. తన మీద తనే సెటైర్స్ వేసుకోవడం.. తన మ్యానరిజం.. యాక్షన్ సీక్వెన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ అయిన గంటలోనే.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతు.. ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి వచ్చేసింది సర్కారు వారి పాట ట్రైలర్. 24 గంటలు గడవక ముందే.. ఫాస్టెస్ట్ 25 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లో 27 మిలియ‌న్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. అలాగే వన్ మిలియన్ కి పైగా లైక్స్ రావడంతో సర్కారు వారి పాట సంచలనంగా నిలిచింది. మే 12న రాబోతుంది. మరి.. ట్రైల‌ర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స‌ర్కారు వారు.. సినిమాతో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular