Saturday, January 18, 2025
Homeసినిమాఈటీవీ విన్ లో దూసుకుపోతున్న 'శశి మథనం'

ఈటీవీ విన్ లో దూసుకుపోతున్న ‘శశి మథనం’

ఈటీవీ విన్ లో ఈ నెల 4వ తేదీ నుంచి ‘శశి మథనం’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ నిర్మించిన ఈ సిరీస్ లో సోనియా సింగ్ – పవన్ సిద్దూ ప్రధానమైన పాత్రలను పోహించారు. వినోద్ గాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సిరీస్, ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుని వెళుతోంది. అందుకు కారణం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సిరీస్ లో ఉండటమే.

కథ విషయానికి వస్తే, శశి – మదన్ ప్రేమించుకుంటారు. మదన్ ఒక ప్రాజెక్టు నమ్ముకుని దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోగా ఖాళీగా ఉండటం ఎందుకని సరదాగా పేకాట ఆడేసి ఒక రౌడీ షీటర్ కి 5 లక్షల అప్పు పడతాడు. ఆ డబ్బు కోసం అతను వెంటపడటంతో శశి ఇంట్లో దాక్కుంటాడు. ఆమె తల్లిదండ్రులు .. తమ్ముడు .. తాతయ్య ఒక పెళ్లికి వెళ్లడం వలన, అతనికి ఆశ్రయం ఇస్తుంది. నిజానికి వాళ్లు 10 రోజుల వరకూ తిరిగొచ్చే అవకాశం లేదు. కానీ ఆ పెళ్లి కేన్సిల్ కావడంతో, వాళ్లంతా హఠాత్తుగా ఊడిపడతారు.

ఊహించని ఈ సంఘటనకి శశి బిత్తరపోతుంది. ఆ ఇంట్లో నుంచి అతణ్ణి తప్పించే మార్గం లేకపోవడంతో, తన రూమ్ లోనే దాచిపెడుతుంది. ఇక అప్పటి నుంచి అతను ఆ ఇంట్లోవారి కంటపడకుండా శశి ఎలా తంటాలు పడిందనేది కథ. సోనియా – మదన్ ఇద్దరికీ యూత్  లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు కథాకథనాలు కూడా మంచి కామెడీ కంటెంట్ తో అలరిస్తాయి. అందువలన ఈ సిరీస్ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇకపై ఈ సిరీస్ లో మరిన్ని సీజన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్