Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Swiss Open-2023:  పురుషుల డబుల్స్ విజేతలు సాత్విక్-చిరాగ్

Swiss Open-2023:  పురుషుల డబుల్స్ విజేతలు సాత్విక్-చిరాగ్

స్విస్ ఓపెన్-2023లో పురుషుల డబుల్స్  టైటిల్ ను భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు గెల్చుకున్నారు. నేడు జరిగిన ఫైనల్స్ లో చైనా ద్వయం రెన్ జియాంగ్ వూ- టాన్ కియాన్ పై 21-19; 24-22తో రెండు వరుస సెట్లలో విజయం సాధించారు.

క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ ద్వయం  జేపీ బే – లస్సే  మాల్డే  జోడీపై 15-21; 21-11; 21-14  తేడాతో…

సెమీస్ మ్యాచ్ లో మలేషియా జోడీ ఆంగ్ యూ సిన్- టోయేఈ పై 21-19; 17-21; 21-17 తేడాతో  సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించి  టైటిల్ రేసులో నిలిచారు.

వీరికి ఈ ఏడాది ఇదే తొలి BWT టైటిల్ కాగా, దీనితో మొత్తం ఐదు టైటిల్స్ వీరి ఖాతాలో చేరాయి. 2018 హైదరాబాద్ ఓపెన్, 2019 థాయ్ లాండ్ ఓపెన్, 2022 ఫ్రెంచ్ ఓపెన్, 2022  ఇండియా ఓపెన్ గెల్చుకున్నారు.    గత ఏడాది వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో మూడో స్థానంలో నిలిఛి కాంస్యం దక్కించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular