Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్BWF World Championships: సెమీస్ కు సాత్విక్- శెట్టి జోడీ

BWF World Championships: సెమీస్ కు సాత్విక్- శెట్టి జోడీ

టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్.  వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో  ఇండియా తరపున ఒకే ఒక జోడీ సెమీస్ కు చేరగలిగింది.  పురుషుల డబుల్స్  లో  సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ  24-22; 21-15, 21-14తో  జపాన్ ద్వయం టకురో హోకి-యుగో కొబ్యాసి పై గెలిపొంది పతకం రేస్ లో నిలిచారు.

కాగా, మరో మ్యాచ్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జోడీ 8-21; 14-21 తేడాతో  ఇండోనేషియా జంట మహమ్మద్ ఆసాన్-హేంద్ర సేతివాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పురుషుల  సింగిల్స్ లో కూడా హెచ్ ఎస్ ప్రన్నోయ్ పోరాడి ఓడిపోయారు. చైనా ఆటగాడు ఝావో జున్ పెంగ్ పై 21-19; 6-21;18-21  తేడాతో ఓటమి పాలై నిష్క్రమించాడు.

Also Read : క్వార్టర్స్ కు ప్రణయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్