సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ కంపెనీ కొత్త ఛైర్మన్ గా సత్య నాదెళ్ళ నియమితులయ్యారు. ప్రస్తుతం అయన అదే కంపెనీ సి ఈ ఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో నాదెళ్ళ నియమితులయ్యారు.
ప్రవాస భారతీయుడు, అందునా మన తెలుగు తేజం సత్య నాదెళ్ళ కు ఈ హోదా దక్కడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. సి ఈ ఓ హోదాలో భారత దేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీ విస్తరణకు అయన కృషి చేశారు. ఇప్పుడు చైర్మన్ హోదాలో మరింతగా మన దేశంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని సాఫ్ట్ వేర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2014 లో స్టీవ్ బల్మార్ స్థానంలో అయన సి ఈ ఓ గా బాధ్యతలు చెప్తారు. ఈ ఏడేళ్ళలో అయన మైక్రో సాఫ్ట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.