Friday, November 22, 2024
HomeTrending NewsMigrants: శరణార్థుల పట్ల సౌదీ అరేబియా క్రూరత్వం

Migrants: శరణార్థుల పట్ల సౌదీ అరేబియా క్రూరత్వం

బతుకు జీవుడా అంటూ వచ్చిన శరణార్థుల విషయంలో సౌది అరేబియా క్రూరంగా వ్యవహరించింది. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా నిర్దయ చూపింది. వంద‌ల సంఖ్య‌లో శ‌ర‌ణార్ధుల్ని సౌదీ ద‌ళాలు చంపిన‌ట్లు తెలుస్తోంది. యెమెన్ సరిహద్దుల వ‌ద్ద సామూహిక హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. మాన‌వ హ‌క్కుల సంస్థ దీనిపై నివేదిక‌ను విడుద‌ల చేసింది. యెమెన్ దేశం మీదుగా సౌదీ ఆరేబియాకు వెళ్తున్న ఇథోపియాకు చెందిన వంద‌లాది శ‌ర‌ణార్థుల్ని సౌదీ ద‌ళాలు కాల్చి చంపిన‌ట్లు తెలుస్తోంది. అనేక సంఖ్య‌లో శ‌ర‌ణార్థులు కాళ్లు పోగొట్టుకున్నారు.

ఇథియోపియా నుంచి బిజౌటి దేశం మీదుగా సముద్ర మార్గంలో యెమెన్ చేరుకున్న శరణార్థులు సౌది అరేబియా వెళ్లేందుకు తీవ్ర ప్రయాస పడుతున్నారు. యెమెన్ – సౌది సరిహద్దుల్లో కొండ కోణాల మీదుగా ప్రయాణంలో ఎంతో మంది చనిపోయారు. తినటానికి ఆహారం లేక కుటుంబ సభ్యులు చనిపోతున్నా ఏమి చేయలేని దైన్య స్థితిలో ఉన్నారు. ఎడారి ప్రాంతం కావటంతో తాగేందుకు నీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో సౌదీకి వస్తే ఆ దేశం కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది.

అయితే  త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని సౌదీ అరేబియా ఖండించింది. హ్యూమ‌న్ రైట్స్ వాచ్‌(హెచ్ఆర్‌డ‌బ్ల్యూ) త‌న రిపోర్టులో అనేక అంశాల్ని పొందుప‌రిచింది. యెమెన్ మీదుగా ప్ర‌తి ఏడాది ఆఫ్రికా నుంచి సుమారు రెండు ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు సౌదీ వెళ్తుంటార‌ని యూఎన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ మైగ్రేష‌న్ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్