Saturday, January 18, 2025
HomeTrending Newsఎర్రకోట వద్ద రాహూల్ సీటింగ్ పై వివాదం

ఎర్రకోట వద్ద రాహూల్ సీటింగ్ పై వివాదం

ఎర్రకోట వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేటాయించిన సీటింగ్ వివాదాస్పదంగా మారింది.

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఎంపిలు, త్రివిధ దళాల అధికారులు, అతిథులు పాల్గొన్నారు. సాధారణంగా కేంద్రమంత్రులు కూర్చునే ముందువరుసలోనే ప్రతిపక్షనేతకు కూడా సీటు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండు దఫాలుగా లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ ఈసారి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉన్నారు.

గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీకి ముందు వరుసలోనే సీటు ఉండేది.  కానీ ఈసారి రాహుల్ గాంధీకి చివరినుంచి రెండో వరుసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రతిపక్ష నేతను అవమానించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఎర్రకోట వేడుకల పర్యవేక్షణ రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈసారి ఒలింపిక్స్ విజేతలకు కూడా సీట్లు కేటాయించాల్సి వచ్చినందునే రాహుల్ సీటు మారిందని రక్షణ శాఖఅధికారులు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్