Wednesday, March 11, 2026
Homeసినిమాదూకుడు పెంచుతున్న రాధేశ్యామ్

దూకుడు పెంచుతున్న రాధేశ్యామ్

Radhe Shyam on Promotions:
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టించిన భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమా కావ‌డంతో రాధేశ్యామ్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాధేశ్యామ్ పై అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి.

ఇటీవ‌ల ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవును.. రాధేశ్యామ్ నుంచి సెకండ్ సింగిల్ రానుంది. ఈ సాంగ్ రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశార‌ని.. న‌వంబ‌ర్ 23న ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సంక్రాంతికి వ‌స్తున్న సినిమాలు ప్ర‌మోష‌న్స్ లో దూసుకెళుతుంటే రాధేశ్యామ్ మాత్రం ప్ర‌మోష‌న్స్ లో స్లోగా ఉంది. అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతుండ‌డంతో ఇక నుంచి మ‌రింత స్పీడుగా ప్ర‌మోష‌న్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Also Read : రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular