Acharya-Sekhar: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలసి నటించడంతో ఆచార్య పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఆచార్య ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల అని ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా పడడంతో.. ఆ ప్రభావం చిరంజీవి సినిమా ఆచార్య పై పడింది. ఆర్‌ఆర్‌ఆర్ వచ్చాకే.. ఆచార్య చిత్రాన్ని విడుదల చేయాలన్నది ఆ రెండు సినిమాల మధ్య జరిగిన లోపాయకారి ఒప్పందం అని టాక్ వినిపిస్తోంది. సో.. ఆచార్య ఫిబ్రవరి 4న వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు ఆ డేట్ ని రాజశేఖర్ తన శేఖర్ సినిమా కోసం లాక్ చేశారు. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. జీవితా రాజశేఖర్ దర్శకురాలు. ఈ సినిమాని సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నారు కానీ.. హడావుడి అయిపోవడంతో… లాస్ట్ మినిట్ లో గందర గోళం ఎందుకని చెప్పి, సంక్రాంతికి విడుదల చేయడం లేదు.
ఆచార్య రావడం లేదు కాబట్టి.. ఆ డేట్ ఖాళీగా ఉంటుంది. పైగా ఫిబ్రవరి 4.. రాజశేఖర్ పుట్టిన రోజు. అలా.. ఆ రోజు కలిసొస్తుందని శేఖర్ టీమ్ భావిస్తోందని తెలిసింది. జోసెఫ్ అనే సినిమాకి రీమేక్ ఇది. ఇటీవలే టీజర్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి. థ్రిల్లర్ సినిమాలు హిట్ అవుతున్న సీజన్ ఇది. అందుకే.. ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. ఈ సినిమాని థియేటర్లలలోనే విడుదల చేయాలని రాజశేఖర్ ఫిక్స్ అయ్యారు. మరి.. శేఖర్ మూవీ రాజశేఖర్ కి సక్సస్ అందిస్తుందేమో చూడాలి.
Also read : ‘తురుమ్ ఖాన్‌లు’ టీజర్ విడుదల చేసిన పరశురాం