Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్Tennis: ఓటమితో సెరెనా వీడ్కోలు

Tennis: ఓటమితో సెరెనా వీడ్కోలు

టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ నేడు జరిగిన యు ఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి  ఆజ్లా తోమ్లా నోవిక్ చేతిలో 7-5;7-5;6-7; 6-1 తేడాతో ఓటమి పాలైంది. ఈ టోర్నీ తర్వాత రిటైర్ అవుతున్నట్లు గతంలోనే ప్రకటించిన సెరెనా నేటి ఓటమితో తన కెరీర్ కు గుడ్ బై చెప్పింది.

ఈ నెల 26వ తేదీ నాటికి 40 నిండి 41వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సెరెనా తన కెరీర్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.  టెన్నిస్ మహిళా క్రీడాకారుల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన ఘనత సొంతం చేసుకున్నారు. మొత్తం 23 టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నారు. వీటిలో ఏడు ఆస్ట్రేలియా ఓపెన్, ఏడు వింబుల్డన్, ఆరు యూఎస్ ఓపెన్, రెండు ఫ్రెంచ్ ఓపెన్ ఉన్నాయి. 2017లో గెల్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఆమెకు చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం గమనార్హం. ఆ తరువాత ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ ఏడాది స్వదేశంలో జరిగే యూఎస్  ఓపెన్ లో సత్తా చాటి వెంటనే రిటైర్  అవ్వాలని నిర్నహించుకున్నారు. అయితే మూడో రౌండ్ లో ఓటమి పాలై టోర్నీ తో పాటు మొత్తం ఆటకే దూరమవుతున్నారు.

టెన్నిస్ కెరీర్ లో ఈ స్థాయికి రావడానికి సోదరి వీనస్ విలియమ్స్ ప్రధాన కారణమని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు  తల్లిదండ్రులకు, ఇప్పటి వరకూ తనను ప్రోత్సహిస్తూ వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్