Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిగ్గులేని జాతికి పౌరుషం వచ్చేదెట్లా?

సిగ్గులేని జాతికి పౌరుషం వచ్చేదెట్లా?

సిటీ బస్సులో ఆదరాబాదరాగా ఎక్కి ఊపిరి తీసుకుంటామో లేదో మెడపక్కగా ఎవరిదో ఊపిరి వెచ్చగా తగులుతుంది. పక్కకి జరగబోయేంతలో వాడి చెయ్యి ఎక్కడో తాకుతుంది. చెంప పగలగొట్టాలని చూస్తే ఎవరో తెలీదు. సిటీ బస్సుల్లో మహిళలు ఎదుర్కొనే ఇలాంటి వేధింపులకు లెక్క లేదు.
సాటి ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించిన ప్రముఖ పోలీస్ ఆఫీసర్ గిల్ ఉదంతం చాలా రోజులు వార్తల్లో ఉంది. ఆయన మీద చర్యలు తీసుకున్న దాఖలా అయితే లేదు. ఇటువంటి ప్రముఖులు ఇంకా చాలామంది ఉన్నారు. తెహెల్కా డాట్ కామ్ ద్వారా పేరు పొందిన తేజ్ పాల్ ఇటువంటి కేసు లోనే ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నాడు. ఆ కేసు అలాగే ఉంది. ఈ మధ్య ఒక మహిళా న్యాయమూర్తి సైతం న్యాయవాది ద్వారా వేధింపులు ఎదుర్కొన్నారని వార్త చదివాం. ఇటువంటి కేసుల్లో చట్టం నిస్సహాయత ఎన్నో సార్లు బయటపడుతోంది . ఒక్కోసారి శిక్ష వేసినా హాస్యాస్పదంగా ఉంటోంది. దీనికి ఉదాహరణ …

ఒక అక్కా తమ్ముడు ముంబై లోకల్ ట్రైన్ ఎక్కారు. తమ్ముడు సీట్ లో కూర్చున్నాడు. అక్క దిగాల్సిన స్టేషన్ దగ్గరకి రావడంతో తలుపుదగ్గర నిలుచుంది. వెనకే నుంచున్న వ్యక్తి ఆమె వెనుక భాగం తాకాడు. గట్టిగా అరిచిందామె. పొరపాటయిందని సారీ చెప్పాడా వ్యక్తి. మళ్ళీ వెంటనే అదే పని చేశాడు. ఈసారి గొడవపెట్టుకుంది. దూరం నుంచి గమనించిన తమ్ముడూ తోడయ్యాడు. ఇద్దరూ కలసి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ? 2019లో. తీర్పు వచ్చింది ఎప్పుడూ? 2023లో. ఏమని? తప్పు జరగడం నిజం. ఆ అమ్మాయికి మానసిక వ్యధ కలిగించడం నిజం. మరి శిక్ష?అదే హాస్యాస్పదం. కోర్టు సమయం ముగిసేవరకు నేరస్తుడు నిలబడి ఉండాలని తీర్పు. మూడేళ్లపాటు కోర్ట్ చుట్టూ తిరిగి అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న యువతికి ఈ తీర్పు ఏ విధంగా ఊరట ఇస్తుంది? అసలు ఇంత తక్కువ శిక్ష వేసి కోర్టు ఆ యువతికి ఎటువంటి న్యాయం చేసినట్టు ?… అని విస్తుపోతున్నారు జనం. ఇలాంటి శిక్షలు మరిన్ని నేరాలు చేయడానికి ఊతమియ్యవా అనికూడా ప్రశ్నిస్తున్నారు.

కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్