Friday, November 22, 2024
HomeTrending Newsకేథలిక్  చర్చిలో చిన్నారులపై అకృత్యాలు

కేథలిక్  చర్చిలో చిన్నారులపై అకృత్యాలు

ఫ్రాన్స్ లోని ప్రసిద్ధి చెందిన  కేథలిక్  చర్చి మత ప్రబోధకులు చిన్నారులపై సాగించిన లైంగిక నేరాలపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర కమిషన్  …దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. గత 70 ఏళ్ల కాలంలో కేథలిక్  చర్చి మత ప్రభోదకులు, మత పెద్దలు 3లక్షల 30వేల మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు కమిషన్ …తెలిపింది. ఈ మేరకు 2వేల 5వందల పేజీల నివేదికను రూపొందించింది.

బాధితుల్లో 80శాతం మంది మగవారే అని వెల్లడించింది. చర్చిలో పని చేసే వారిలో 3వేల మంది లైంగిక ఆకృత్యాలకు పాల్పడగా, వీరిలో మూడింట రెండు వంతుల మంది మత ప్రభోదకులే అని తెలిపింది. 1950 నుంచి వచ్చిన మీడియా కథనాలు సహా పోలీసులు, న్యాయస్ధానాల విచారణ, చర్చి నుంచి వివరాల సేకరణ ద్వారా కమిషన్  ఈ నివేదికను రూపొందించింది. రెండున్నరేళ్ల పాటు పని చేసిన కమిషన్ …. బాధితులు, సాక్షుల నుంచి కూడా వివరాలు సేకరించింది. దర్యాప్తు ప్రారంభంలో ఓ హాట్ లైన్  ఏర్పాటు చేయగా, 6వేల 5వందల మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్