గ్రాండ్ గా ‘సైతాన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్

ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ‘మీరు దీనిని నేరం అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటారు’ అనే థీమ్ లో సైతాన్ సాగుతుందని ఆల్రెడీ తెలిపారు. థీమ్ కి తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ తమ మనుగడ కోసం క్రైమ్స్ మొదలు పెట్టింది అనేది ఈ చిత్ర కథ. ఇందులో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ… సైతాన్ అనేది క్రైమ్ డ్రామా. ఇంతకు ముందు మేము డిస్ని ప్లస్ హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగెర్స్ కోసం పనిచేశాం. సైతాన్ అనేది కంప్లీట్ గా డిఫెరెంట్ ప్రాజెక్ట్. క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారి కోసం టార్గెట్ చేసి తెరకెక్కించాం. గతంలో నేను నాలుగైదు చిత్రాలు తెరకెక్కించా. ఏ చిత్రానికి కూడా న్యూడిటీ, అభ్యంతరకర డైలాగ్స్ లాంటి సెన్సార్ సమస్య రాలేదు. కానీ సైతాన్ లో అన్నీ ఉన్నాయి. మీరు ట్రైలర్ చూస్తే.. ఇలాంటి బలమైన కథ చెప్పేందుకు ఆ పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక మా నటీనటుల గురించి చెప్పాలంటే… వారు ఎంతో ఫ్యాషన్ తో వర్క్ చేశారు. ఈ కథకు తగ్గట్లుగా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతో కలసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *