Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Shami: నేనైతే షమీని ఎంపిక చేసే వాడిని: శ్రీకాంత్

Shami: నేనైతే షమీని ఎంపిక చేసే వాడిని: శ్రీకాంత్

ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టుపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా పేసర్ మహమ్మద్ షమికి చోటు దక్కకపోవడంపై సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్, ఒకప్పటి డేరింగ్  ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. తాను ఇప్పుడు చైర్మన్ అయి ఉంటే తప్పకుండా షమికి అవకాశం ఇచ్చే వాడినని వెల్లడించాడు. రవి బిష్ణోయ్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని అతని కంటే అక్షర్ పటేల్ మంచి ఛాయిస్ అయి ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. జట్టు బాగానే ఉందని, అయితే షమి విషయంలోనే తప్పు జరిందని పేర్కొన్నారు.

కాగా, ఆగస్ట్ 27నుంచి సెప్టెంబర్ 11 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆసియా కప్ జరగనుంది. గాయాల కారణంగా కొంత కాలంగా ఆటకు దూరమైనా కెఎల్ రాహుల్ కు చోటు దక్కడంతో పాటు వైస్ కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు.

గాయం కారణంగా జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లను ఆసియా కప్ కు ఎంపిక చేయలేదు. శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ లను స్టాండ్ బై లో ఉంచారు.

జట్టు వివరాలు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్