Sunday, January 19, 2025
HomeTrending Newsబార్ల తెలంగాణ... బీర్ల తెలంగాణ..

బార్ల తెలంగాణ… బీర్ల తెలంగాణ..

పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కెసిఆర్ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అన్నీ ఖాళీగానే ఉన్నాయని, 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోందన్నారు. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరని, బంగారు తెలంగాణ తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ….బీరుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

ఉస్మానియా యూనివర్సిటీ33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం పోస్టులు ఖాళీలు ఉన్నాయని షర్మిల తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా….మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు.

ముస్లీంలకు వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేశారని, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కెసిఆర్ ప్రభుత్వమే అన్నారు. వైఎస్ ను కించపరిచేలా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే నేను వారి అవినీతి పై వంద మాట్లాడుతనని షర్మిల హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్