Monday, May 20, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. షారుఖ్ జోస్యం

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. షారుఖ్ జోస్యం

బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోల మధ్య ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే.. ముంబాయిలోనో, హైదరాబాద్ లోనో షూటింగ్ లో కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగేది. ఒకరి సినిమాల గురించి మరొకరు అడగడం జరిగేది. అయితే… పబ్లిక్ గా అందరి ముందు మాట్లాడడం అనేది చాలా అరుదుగా జరిగేది. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక బంధాలు మరింత బలపడ్డాయి. ఇక అసలు విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఈ మూవీ ట్రైలర్ ను తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేస్తే.. తమిళ్ లో విజయ్ రిలీజ్ చేశారు. కంటెంట్ ఎలా ఉన్నా అందులో యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా కేవలం రెండున్నర నిమిషాల వీడియోలోనే అర్థమైపోయింది. విజయ్ దీని గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ఆల్రెడీ వైరల్ అయ్యింది. తాజాగా పఠాన్ గురించి రామ్ చరణ్  గొప్పగా చెబుతూ ఎప్పుడూ చూడని పోరాట దృశ్యాల్లో స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నట్టు విషెస్ చెప్పాడు. అయితే.. షారుఖ్ ఖాన్ సింపుల్ గా థాంక్స్ తో సరిపెట్టలేదు. పనిలో పనిగా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అంటూ జోస్యం చెప్పేశారు.

ఇంతకీ షారుఖ్ ఖాన్ ఏమన్నారంటే… “మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ని ఇండియాకు తెచ్చినప్పుడు ఒకసారి దాన్ని తాకే అవకాశం ఇమ్మని అందులో అభ్యర్థించడం ఇద్దరి అభిమానులను ఆకట్టుకుంది. ముందు ఇంగ్లీష్ లో పెట్టి దాని అనువాదాన్ని తెలుగులో కూడా ట్వీట్ చేయడం మరో విశేషం. చరణ్ ని మెగా పవర్ స్టార్ అని సంబోధించడం గమనార్హం. విజయ్ కు కూడా స్పందించిన షారుఖ్ ఈరోజు అదే పనిగా సెలబ్రిటీలకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న పఠాన్ మీద కింగ్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. జనవరి 25న హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలో బాలీవుడ్ వర్గాలున్నాయి. ఏది ఏమైనా షారుఖ్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ వస్తుందని జోస్యం చెప్పడంతో ఆస్కార్ పై నమ్మకం మరింత పెరిగింది.

ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటకు 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో విజేతగా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే రాబోయే ఆస్కార్ అవార్డు కూడా సాధించాలని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్