Sunday, June 7, 2026
Homeసినిమాకె.జి.ఎఫ్. స్థాయిలో వస్తోన్న మరో కన్నడ చిత్రం ‘భజరంగి-2’

కె.జి.ఎఫ్. స్థాయిలో వస్తోన్న మరో కన్నడ చిత్రం ‘భజరంగి-2’

‘బాహుబలి’ సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ రావడంతో కన్నడ భాషలో నిర్మించిన ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్-1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘జై భజరంగి’.

కరుణా చక్రవర్తి డా.శివ రాజ్ కుమార్  హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది. డా.శివ రాజ్ కుమార్  హీరోగా 2013 లో విడుదలైన నటించిన ‘భజరంగి’ కర్ణాటక రాష్ట్రంలో 212 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి-2’ తో, తెలుగులో ‘జై భజరంగి’  టైటిల్ తో  విడుదలవుతోంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ  బాలాజీ వీడియో అధినేత నిరంజన్ పన్సారి  ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

“గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్న ప్రసిద్ధ  సంస్థ ‘శ్రీ  బాలాజీ వీడియో’ ఇప్పటి వరకు సుమారు 400 చిత్రాలకు పైగా  వీడియో హక్కులను పొందివున్నాం. ఇప్పటి వరకు  మేమిచ్చే వీడియో నాణ్యతను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగులో ‘మగధీర’ తో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా పరిచయం చేశాం. మా ‘శ్రీ బాలాజీ మూవీస్’ యూట్యూబ్ ఛానల్ కు కోటి 35 లక్షల వీక్షకులు ఉన్నారు. ‘జై భజరంగి’  చిత్రంతో టాలీవుడ్  నిర్మాణరంగం లోకి అడుగుపెడుతున్నాం.  ‘భజరంగి-2’ 2019లో  షూటింగ్ ప్రారంభించారు. ఈ రెండేళ్ళు  కరోనా క్రైసెస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలస్యం అయింది. భజరంగి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది. కన్నడ తెలుగు భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular