Thursday, March 28, 2024
Homeసినిమా‘1997’ సినిమాలో మంగ్లీ సాంగ్ విడుదల

‘1997’ సినిమాలో మంగ్లీ సాంగ్ విడుదల

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో… డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ సినిమా సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన ‘ఏమి బతుకు’ అనే సాంగ్ ని  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరి లతో పాటు తదితర చిత్ర  యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ “మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఈ సినిమా గురించి నాకు తెలుసు, చాలా పవర్ ఫుల్ కథతో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అని షాక్ అయ్యాను.   కథ విషయంలో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేసాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా రెండు పాత్రలు బాగా చేసాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట విన్నాను. చాలా ఎమోషన్ అయ్యాను. నిజంగా చాలా ఆలోచింపచేసేలా ఉండే సాంగ్ ఇది. ఈ సినిమాతో మోహన్ తప్పకుండా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకుంటాడు” అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ “మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. అతను నాకు కొడుకు లాంటివాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అలాగే ఇందులో ఓ సాంగ్ యాడ్ చేద్దామని మోహన్ అన్నాడు. సరే అని చెప్పడంతో తానే ఈ సాంగ్ అద్భుతంగా రాశాడు. ఈ పాటకు మంగ్లీ అయితేనే న్యాయం చేస్తుందని అనిపించి ఆమెతో పాడించాం. మంగ్లీ గొంతులో నుండి వచ్చిన ఈ సాంగ్ మరో రేంజ్ కి వెళ్ళింది. తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది” అన్నారు.

హీరో మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా రాజా రవీంద్ర గారికి, ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసినందుకు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ గారికి, హీరో విశ్వక్ సేన్ గారికి, అలాగే దర్శకుడు వర్మ గారికి, అలాగే ప్రముఖ నటులు  ప్రకాష్ రాజ్ గారికి .. వారితో పాటు  కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. మంగ్లీ పాడిన పాట చాలా బాగా వచ్చింది. ప్రతి  కదిలించే సాంగ్ ఇది. తప్పకుండా వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ ని పెట్టించేందుకు మళ్ళీ షూటింగ్ చేయకుండా షూట్ చేసిన సన్నివేశాలే వాడాము. పాటకు ఆ సీన్స్ బాగా సింక్ అయ్యాయి. ఈ పాటను మంగ్లీ పాడడంతో ఈ సాంగ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్