ఆగష్టు 1 నుంచి షూటింగులు ఆపేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొంత మంది నిర్మాతలు విమర్శించారు. గిల్డ్ పై కాస్త ఘాటుగానే విమర్శలు కూడా చేశారు. అయితే.. ఈరోజు ఫిలిం ఛాంబర్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నిర్మాతలందరూ కలిసి ఆగష్టు 1 నుంచి షూటింగులు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. జనరల్ బాడి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నాం. మళ్లీ కూర్చొని మాట్లాడుకుంటాం. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరకూ ఈ నిర్ణయం ఉంటుంది. మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ చేస్తామనేది మీడియా ద్వారా తెలియచేస్తామన్నారు.