Friday, May 31, 2024
Homeసినిమాథాంక్యూ’లో చైతన్య అద్భుతంగా చేశాడు: దిల్ రాజు

థాంక్యూ’లో చైతన్య అద్భుతంగా చేశాడు: దిల్ రాజు

Extraordinary: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు మీడియాతో సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

“నేను ఇప్పటిదాకా  చేసిన సినిమాలను నా లైఫ్ తో పోల్చుకోలేదు. ఇప్పుడు ‘థాంక్యూ’ని పోల్చుకున్నాను. రైటర్‌ రవి నాలుగేళ్ల క్రితం ఈ స్టోరీని నెరేట్‌ చేశారు. నాకు అందులో పాయింట్‌ బాగా నచ్చింది. లైఫ్‌లో థాంక్యూ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. ఎక్కడో స్టార్ట్ అయిన నా లైఫ్‌లో… ఆటో మొబైల్స్ నడుపుతున్నప్పుడు, ఎడ్యుకేషన్‌ టైమ్‌లోగానీ, డిస్ట్రిబ్యూటర్‌గా గానీ, నిర్మాతగా గానీ చాలా మంది హెల్ప్ చేశారు. సొసైటీకి దిల్‌రాజుగా కనిపిస్తున్నా, నా జర్నీలో నాకు గుర్తుండో, గుర్తులేకనో నాకు చాలా మంది హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆగి వాళ్లను కలిస్తే, నా ఎమోషన్స్, వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేదే కథ. ఈ పాయింట్‌కి నేను కనెక్ట్ అయ్యాను.

ఆ కేరక్టర్‌కి గతం చెప్పాలనుకున్నాం. కాలేజ్‌, టీనేజ్‌, లైఫ్‌… అన్నిటినీ డిజైన్‌ చేశాం. రవి ఐడియాని మేం అందరం కూర్చుని డిజైన్‌ చేసి మంచి కథ చేశాం. ఎవరు డైరక్ట్ చేస్తే బావుంటుందా? అని ఆలోచించాం. ఇద్దరు, ముగ్గురు డైరక్టర్ల పేర్లు అనుకున్నాం. అప్పుడు నాకు విక్రమ్‌ గుర్తొచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్‌’  ప్రివ్యూ చూడ్డానికి వెళ్లా. స్టార్ట్ కావడానికి పది నిమిషాలు టైమ్‌ ఉందంటే అప్పుడు విక్రమ్‌కి ఈ పాయింట్‌ చెప్పా. విక్రమ్‌ ఎగ్జయిట్‌ అయ్యాడు.

స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్‌ స్టైల్‌లో రాయమని అతనికి ఇచ్చాను. ఇది 2019లో జరిగింది. ప్యాండమిక్‌ టైమ్‌లో నేను కూడా ‘థాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాను. నాకు స్కూల్లో హెల్ప్ చేసిన వారిని, ఆటోమొబైల్స్ లో హెల్ప్ చేసిన వారిని అందరినీ కలిశా. ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేయాలి. అప్‌టు 50 పిలిమ్స్ కంటిన్యూ చేయాలి నేను. అదే నా విజన్‌. సినిమా రిలీజ్ కన్నా ముందే కంప్లీట్‌ చేయాలి. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. నా జర్నీలో నేను కాస్ట్యూమ్స్ కృష్ణ వరకు వచ్చాను. పెళ్లి పందిరి సినిమా సక్సెసే నన్ను నిలబెట్టింది. నా లైఫ్‌ లాంగ్‌ నేను దాన్ని మర్చిపోను. అవన్నీ ఫొటోలు, వీడియోలాగా రెడీ చేస్తున్నా. అక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో థాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నా.

ఈ కాన్సెప్ట్ ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్‌ అయ్యాం. ఎందుకంటే.. జనాలు ఆడిటోరియానికి రావడానికి క్యారక్టర్‌ కనెక్ట్ కావాలి, అందుకే ఎక్కువ స్ట్రగుల్‌ ఫేస్‌ చేశాం. ఒక నార్మల్‌ కుర్రాడు, ఒక లెజెండరీ అయ్యాడు. అతను మొత్తం నాది అని అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీస్‌, కమర్షియల్‌ యాంగిల్స్ అన్నీ కలిపితే ఈ సినిమా.

Farewell Song

ఈ సినిమాను డిజైన్‌ చేయడం బిగ్‌ జర్నీ. ప్రేమమ్ లాగా మూడు స్టోరీలున్నాయి. ఆటోగ్రాఫ్‌లాగా ఉంది అని అనడం కూడా విన్నాను. ప్రేమమ్‌లో లవ్‌ స్టోరీస్‌ చెప్పారు. కానీ మాది లైఫ్‌ స్టోరీ. టీనేజ్‌లో ఈయనకు లైఫ్‌లో ఏం జరిగింది? కాలేజ్‌లో స్టోరీ ఏం జరిగింది? జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్‌. నేను మా సినిమా కథను ఎక్కడా హైడ్‌ చేయడం లేదు. స్టోరీ చెప్పేస్తున్నా. ఇప్పుడు గతం గురించి ఆలోచించే టైమ్‌ ఎవరికీ లేదు.

విక్రమ్‌ ‘మనం’ని చాలా అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. మామూలుగా అయితే.. మనం కథ వినేటప్పుడు కన్‌ఫ్యూజ్‌ అవుతాం. అయినా చాలా అర్థం చేసుకుని చేశాడు. విక్రమ్‌తో మాట్లాడుతున్నప్పుడు చైతన్య ఎలా ఉంటాడు? అని అన్నాడు. నాకు సూపర్‌ అనిపించింది. చైతన్యని నేను కలిసినప్పుడు వెంటనే ఓకే అన్నాడు. మూడు లుక్స్ కి రెడీ కావాల్సిన క్యారక్టర్‌ అయినా వెంటనే ఓకే చెప్పాడు. విక్రమ్‌కి, చైతూకి ఉన్న కెమిస్ట్రీతో మేం అందరం ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాం.  చైతన్య ఎక్స్ ట్రార్డినరీ జాబ్‌ చేశాడు.

విక్రమ్‌ తీసిన ఇష్క్, మనం, 13బీ సక్సెస్‌ఫుల్‌ ఫిల్మ్స్. అవన్నీ డిఫరెంట్‌ కాన్సెప్ట్స్. ‘హలో’లో లవ్‌స్టోరీ బావుంటుంది. కానీ ఎక్కడో ఆడియన్స్ కి రీచ్‌ కాలేదు. గ్యాంగ్‌లీడర్‌ కూడా అంతే. అవన్నీ విక్రమ్‌తో మాట్లాడాను. ఇప్పుడు థాంక్యూ 100 శాతం ఆడిటోరియానికి రీచ్‌ కావాలంటే నేను ఈ సినిమాతో జర్నీ చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాను. టీమ్‌ డిస్కషన్‌కి తనని ఒప్పించాను. కొన్నిసార్లు ఎక్కడో ఇబ్బందిపడ్డాడు. అయినా నేను నచ్చజెప్పాను. షూటింగ్‌, ఎడిటింగ్‌ ప్రాసెస్‌లో ఇలాగే పని చేశాం. ప్రతిచోటా టీమ్‌ వర్క్, హోమ్ వర్క్ లాగా చేశాం.

ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా, నష్టమే ఉంది. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయితే ఆ ఎనర్జీ వేరు. ఆడుతున్నకొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ ఇస్తుంది. సినిమా ప్యాషన్‌గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ ముఖ్యమే. ఎనర్జీ కూడా ముఖ్యమే. మైనస్‌లు తీసేసి, ప్లస్‌ల వైపు డ్రైవ్‌ చేయాలి. ప్రొడ్యూసర్ల గురించి హీరోలకు కన్‌సర్న్ ఉంటుంది. వాళ్లకీ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్‌ చేయాలి. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యను అర్థమయ్యేలా చెబితే సరిపోతుందని నా ఫీలింగ్‌.

Also Read : నాగ‌చైత‌న్య థ్యాంక్యూ ర‌న్ టైమ్ ఫిక్స్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్