Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్CWG-2022:  స్వర్ణం సాధించిన జెరేమీ

CWG-2022:  స్వర్ణం సాధించిన జెరేమీ

కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా మరో స్వర్ణ పతకం సాధించింది. ఇది కూడా వెయిట్ లిఫ్టింగ్ లోనే కావడం గమనార్హం. 67 కిలోల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రిన్నుంగా గోల్డ్ మెడల్ గెల్చుకున్నాడు. పురుషుల 67 కిలోల విభాగంలో స్నాచ్ కేటగిరీలో 140 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 160 కిలోలు కలిపి మొత్తం 300 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.

ఇప్పటి వరకూ భరత్ కు మొత్తం ఐదు పతకాలు లభిస్తే ఇవి మొత్తం వెయిట్ లిఫ్టింగ్ లోనే కావడం విశేషం.

లాల్ రిన్నుంగాతో పాటు…. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్,  మహిళల 55 కేజీల విభాగంలో బింద్యా రాణి రజతం… పురుషుల ­55 కిలోల సంకేత్ సర్గార్ రజతం, పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం సంపాదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular