Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs SA ODI Series: శ్రేయాస్ సెంచరీ- ఇండియా విజయం

IND Vs SA ODI Series: శ్రేయాస్ సెంచరీ- ఇండియా విజయం

శ్రేయాస్ అయ్యర్ అజేయమైన సెంచరీ (113*) తో పాటు ఇషాన్ కిషన్ 93 పరుగులతో రాణించడంతో నేడు సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేను ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెల్చుకుంది.

రాంచీ లోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు పరుగులకే ఓపెనర్ డికాక్(5) ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ మలాన్ 25 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో హెండ్రిక్స్-ఏడెన్ మార్ క్రమ్ లు మూడో వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెండ్రిక్స్-74; మార్ క్రమ్-79 పరుగులు చేసి ఔటయ్యారు. క్లాసేన్-30; మిల్లర్-35(నాటౌట్)  పరుగులతో రాణించారు.నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో సిరాజ్ మూడు; వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా 48 పరుగులకు ఇద్దరు ఓపెనర్ల (కెప్టెన్ ధావన్-13; శుబ్ మన్ గిల్-28) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్- శ్రేయాస్ అయ్యర్ లు మూడో వికెట్ కు 161 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాతా అయ్యర్-సంజూ శామ్సన్ లు మరో వికెట్ పడకుండా 45.5  ఓవర్లలోనే ఇండియాకు విజయం అందించారు. అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113  పరుగులు చేయగా, శామ్సన్ 36 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 30 పరుగులు చేశాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో ఫార్ట్యూన్, పార్నెల్, రాబడ తలా ఒక వికెట్ పడగొట్టారు.

శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read :  ఉప్పల్ లో ఇండియాదే గెలుపు- సిరీస్ కైవసం

RELATED ARTICLES

Most Popular

న్యూస్