భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. 2021 మార్చి నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు అతని భుజానికి బలమైన దెబ్బ తగిలింది. ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాడు శ్రేయాస్. ఏప్రిల్ లో భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఈ గాయం కారణంగానే ఐపిఎల్ కూడా అయ్యర్ ఆడలేకపోయాడు.
శ్రేయాస్ భుజం నొప్పి నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. అక్టోబర్ నెలలో జరగబోయే టి-20 ప్రపంచకప్ నాటికి అయ్యర్ అందుబాటులోకి వస్తాడని బిసిసిఐ ఆశాభావంతో ఉంది.
జూలై లో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టు 3 వన్డేలు, 3 టి-ట్వంటి మ్యాచ్ లు ఆడనుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు సన్నద్ధం కావాల్సి ఉండడంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్ళు శ్రీలంక టూర్ కు దూరమవుతున్నారు. తొలుత శ్రీలంక వెళ్ళే టీం కు శ్రేయాస్ సారధ్యం వహిస్తారని అనుకున్నారు. కాని అతని శానంలో ఇప్పుడు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా ల్లో ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేస్తారని తెలిసింది.