గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ బృందం

Shyam Singha Roy Team:
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా శ్యామ్ సింగ రాయ్ టీమ్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని జిహెచ్ఎంసి పార్కులో మొక్కలు నాటింది. హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. తాము కూడా పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు.

గ్రీన్ఇండియా ఛాలెంజ్ కరుణాకర్ రెడ్డి, రాఘవ  వృక్ష వేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు. ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన ఈ పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్  సినిమా బృందం అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *