Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ముందుకు సాగాలసిన సమయం: శిఖర్ రిటైర్మెంట్

ముందుకు సాగాలసిన సమయం: శిఖర్ రిటైర్మెంట్

భారత క్రికెటర్  శిఖర్‌ ధావన్‌ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌ కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. వన్డేల్లో 6,793, టెస్ట్‌ల్లో 2,315, టీ20ల్లో 1,759 పరుగులు శిఖర్‌ ధావన్‌ చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి.

ఓపెనర్ గా, వన్ డౌన్ లో దిగి పలు కీలక మ్యాచ్ ల్లో విజయానికి చక్కటి పునాది వేశాడు.  చురుకైన ఆట తీరుతో పాటు…. ఫీల్డింగ్ లో సైతం అద్భుత క్యాచ్ లు పట్టి మ్యాచ్ జయాపజయాలను ప్రభావితం చేయగలిగాడు. ఆటతో పాటు తోడ తొట్టడం, మీసాలు తిప్పడం లాంటి హావభావాలతో మైదానంలోని ప్రేక్షకులను అలరించేవాడు.

“దేశం కోసం ఆడటం నా కల.. నిజమైంది.. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది.. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు’  అంటూ శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్