Sunday, January 19, 2025
Homeసినిమాశింబూని 'ముత్తు' సినిమా మురిపించేనా?

శింబూని ‘ముత్తు’ సినిమా మురిపించేనా?

కోలీవుడ్ లో శింబుకి కూడా మంచి క్రేజ్ ఉండేది. బలమైన సినిమా నేపథ్యం ఉండటం వలన కుర్రాడు ఒక రేంజ్ లో దూసుకుపోయాడు. కథ, స్క్రీన్ ప్లే .. మాటలు రాయడం .. పాటలు పాడటంలోనూ తనకి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు. కుర్రాడు ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. అయితే ఆ తరువాత ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి, కెరియర్ ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కాస్త వెనకబడిపోయాడు .. డీలాపడిపోయాడు కూడా. దీనికి తోడు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆయన సతమతమవుతూ వచ్చాడు.

తోటి హీరోలంతా కెరియర్ పరంగా ముందుకు వెళుతుండటంతో, ఇక ఈ మధ్య మళ్లీ తన కెరియర్ ను గాడిలో పడేసే ప్రయత్నంలో శింబు ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసిన ‘మానాడు’ భారీ విజయాన్ని సాధించింది. గతంలో ఆయన నుంచి వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఇక్కడి యూత్ ను ఊపేశాయి. ‘మానాడు’ మాత్రం ఇక్కడ రిలీజ్  కాలేదు. టాలీవుడ్  హీరోతో ఆ సినిమా ఇక్కడ రీమేక్ కానుంది. అలాంటి శింబు తాజాగా చిత్రంగా తమిళంలో ‘వెందు తుణీందదు కాడు’ అనే సినిమా రూపొందింది. తెలుగులోనూ ఈ సినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది.

కమల్ – రజనీ తరువాత  తెలుగులోను తమ సినిమాలు విడుదలయ్యేలా విక్రమ్ .. విశాల్ .. సూర్య చూసుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో అజిత్ – విజయ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ దృష్టిపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడానికి ధనుశ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడు అదే దారిలో ముందుకు వెళ్లడానికి శింబు రెడీ అవుతున్నాడు. ఇంతవరకూ తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేయడం పట్ల శ్రద్ధ చూపుతూ వచ్చిన శింబు, ఇప్పుడు తమిళంతో పాటు తన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేలా దృష్టి పెడుతున్నాడు. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమా ఇక్కడి నుంచి కూడా ఆయనకి హిట్ టాక్ వినిపించేలా చేస్తుందేమో చూడాలి.

Also Read: ఈ నెల 15న ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్