Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్కొరియా ఓపెన్: సెమీస్ లో సింధు, శ్రీకాంత్ ఓటమి

కొరియా ఓపెన్: సెమీస్ లో సింధు, శ్రీకాంత్ ఓటమి

Korea Open-2022: భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ సెమీఫైనల్స్ లో ఓటమి పాలయ్యారు. నేడు జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ కొరియా క్రీడాకారిణి అన్ సెయాంగ్ చేతిలో సింధు 21-14; 21-17 తేడాతో ఓటమి పాలైంది.

పురుషుల సెమీఫైనల్ మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ 21-19; 21-16 తేడాతో జోనాథన్ క్రిస్టీ చేతిలో పరాజయం చెందాడు. వీరిద్దరి ఓటమితో కొరియా ఓపెన్ లో  ఇండియా కథ ముగిసినట్లయింది.

ఏప్రిల్ 12 నుంచి 17 వరకూ గ్వాంగ్ జు యోనెక్స్ కొరియా మాస్టర్స్ టోర్నీ కి మన ఆటగాళ్ళు సన్నద్ధం కావాల్సి ఉంది. ఈ టోర్నీనుంచి భారత స్టార్ ఆటగాళ్ళు లక్ష్య సేన్, సింధు వైదొలిగారు.

Also Read : కొరియా ఓపెన్: సెమీస్ కు సింధు, శ్రీకాంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular