Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్కొరియా ఓపెన్: సెమీస్ కు సింధు, శ్రీకాంత్

కొరియా ఓపెన్: సెమీస్ కు సింధు, శ్రీకాంత్

Korea Open-2022: భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ లో సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీకాంత్ తన ప్రత్యర్థి, సౌత్ కొరియా ఆటగాడు వాన్ హో సోన్ ను 21-12; 18-21; 21-12 తేడాతో ఓడించారు.

సింధు 21-10; 21-16 తో థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ పై గెలుపొందింది. మొదటి సెట్ అవలీలగా గెల్చుకున్న సింధుకు రెండో సెట్లో బుసానన్ గట్టి పోటీ ఇచ్చినా చివరకు సింధుదే పైచేయి అయింది.

గత వారం ముగిసిన స్విస్ ఓపెన్ ఫైనల్లో బుసానన్ ను ఓడించి సింధు టైటిల్ గెల్చుకున్న విషయం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular