Sunday, November 24, 2024
HomeTrending Newsకాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆర్థిక సాయం

కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆర్థిక సాయం

సింగరేణిలో కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికుల మాదిరిగా 15 లక్షల రూపాయలు ప్రత్యేక ఎక్స్గ్రేషియో చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేసిన నిరవధిక సమ్మే పలితంగా సింగరేణి యాజమాన్యం శనివారం సర్క్యూలర్ విడుదల చేసింది. దాని ప్రకారం 2020 మార్చి తర్వాత కరోనా వల్ల మరణించిన కాంట్రాక్టు కార్మికులకు 15 లక్షల ఎక్స్ గ్రే షియో చెల్లిస్తారు. ఈ మేరకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు.శనివారం  కొత్తగూడెం ఏరియాలోని ఆర్ సి హెచ్ పి వద్ద కాంట్రాక్ట్ కార్మికులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ నెల 26వ తేదీన యాజమాన్యంతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ లోని విషయాలను నేతలు వివరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జరిగిన అగ్రిమెంట్ ప్రకారం యాజమాన్యం కరోనా మరణానికి 15 లక్షల ప్రత్యేక సర్క్యులర్ ను విడుదల చేసిందని,దాని ప్రకారం సరైన ఆధారాలతో స్థానిక ఏరియా అధికారులకు సమర్పించాలన్నారు. దాని ఆధారంగా 15 లక్షల రూపాయలను చెక్కు రూపంలో నామినీ ఉన్న వ్యక్తులకు బ్యాంకు ఖాతాలో చెల్లిస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం అగ్రిమెంట్ లో ఉన్న అంశాల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రిమెంటులోని అంశాలను అమలు చేయడం ద్వారా కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్న గందరగోళ్ల పరిస్థితిని నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, ఇనుపనూరి నాగేశ్వరరావు,కిషోర్,బి వీరు,బోలా సింగ్,శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్